© 2026 nimisham.in
CJP లీడర్ అభిజిత్ దీప్కేపై దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' (NEET) పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలో గందరగోళం, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యలపై జైపూర్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను మద్దతుదారులు భుజాలపై మోసుకెళ్తుండగా.. గుంపులోని కొంతమంది యువకులు అకస్మాత్తుగా ఆయనపై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత దాడి చేసిన వారిని అక్కడున్న మిగతా యువకులు కొట్టగా.. వాళ్లను వదిలివేయాలని అభిజిత్ దీప్కే వేదికపై నుంచి కోరారు. ఈ ఘటనపై జైపూర్ సౌత్ డీసీపీ రాజర్షి రాజ్ వర్మ స్పందిస్తూ.. దాడికి పాల్పడిన ముగ్గురితో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడి పిరికితనానికి నిదర్శనమని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన