
హత్యకేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు తొప్పై గణేషన్ గురించి తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో ఆ గ్యాంగ్ సభ్యులు దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. కేసు వివరాలను ఎస్పీ డీపీవోలో మంగళవారం విలేకర్లకు వెల్లడించారు. ఈ నెల 2న శ్రీకాళహస్తిలోని పీఆర్ గెస్ట్‌హౌస్ సమీపంలోని స్వర్ణముఖి నదికట్టపై పట్టణానికి చెందిన మగలంపాటి శివకుమార్ దారుణ హత్యకు గురయ్యారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరిపారు. సాంకేతిక ఆధారాలు వినియోగిస్తూ నలుగురు నిందితులను గుర్తించి ఈనెల 11న అరెస్టు చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, రెండు కత్తులు, రెండు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకులు తొప్పై గ్యాంగ్ సభ్యులు: తమిళనాడు తొప్పై గణేషన్‌తో శివకుమార్‌కు పరిచయం ఉంది. తమిళనాడు పోలీసులు గణేషన్‌ను మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా ప్రకటించారు. దీంతో అతను కొంతకాలం శ్రీకాళహస్తిలో శివకుమార్ దగ్గర తలదాచుకున్నారు. మార్చి 16వ తేదీ శ్రీకాళహస్తి నుంచి తమిళనాడుకు తొప్పై గణేషన్ వెళ్తుండగా పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. శివకుమార్‌కు మాత్రమే తెలిసిన గణేషన్ ఉనికి తమిళనాడు పోలీసులకు తెలియడంపై గ్యాంగ్ సభ్యులకు అనుమానం వచ్చి అతనే సమాచారం ఇచ్చాడనే నెపంతో గ్యాంగ్ సభ్యులు హత్యకు పాల్పడ్డారు. ఏ1 తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలూకా తాలవేడుకు చెందిన వెంకటేషన్ కార్తీక్ (32)పై తమిళనాడులో 4 కేసులు నమోదయ్యాయి. ఏ2 అంబలత్తూరు తాలూకా పడి గ్రామానికి చెందిన వేలు గోపినాథ్ (27)పై 25 కేసులు ఉన్నాయి. ఏ3 పొన్నేరి తాలూకా ఎడపాళ్యంకు చెందిన శ్రీధర్ (26)పై నాలుగు కేసులు నమోదయ్యాయి. నిందితులకు కత్తులు, ద్విచక్ర వాహనం సమకూర్చిన ఏ4 తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన మునస్వామి సూర్య (19)పై తమిళనాడులో రెండు