
ఇంటర్నెట్‌డెస్క్: ఉగ్రవాదం నిర్మూలన దృష్ట్యా భారత్ ఇప్పటికైతే తక్షణ ముప్పుగా పాకిస్థాన్‌ను (Pakistan) చూస్తోందని.. కానీ, దీర్ఘకాలిక పోటీదారు మాత్రం చైనానే (China) అని మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అన్నారు. ఆయన రాసిన కొత్త పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ పుస్తకావిష్కరణలో మాట్లాడారు. పాకిస్థాన్, చైనా నుంచి ఎదురువుతోన్న సవాళ్లలో తేడాను నరవణే స్పష్టంగా చెప్పారు. బలమైన సైనిక ప్రతిఘటనను ఇస్తూనే.. చైనాతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. పాకిస్థాన్, చైనా పూర్తిగా భిన్నమైన అంశాలని పేర్కొన్నారు. రెండింటితో అస్థిర సరిహద్దులు ఉండటంతోపాటు.. యుద్ధాలు కూడా జరిగాయని వెల్లడించారు. ఆ రెండు దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.