© 2026 nimisham.in
2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మురళీ కిషోర్ అబ్బూరు.. ఇప్పుడు 'లెనిన్' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు మురళీ కిషోర్ ను టీడీపీ ఎమ్మెల్యే సన్మానించారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదివారం నాడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరును కలిసి ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. మరోవైపు మురళీ తన సొంతూరులో ఫ్యామిలీతో కలిసి 'లెనిన్' మూవీ చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'లెనిన్' సక్సెస్ మీట్ లో మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. 16 ఏళ్ల తరువాత తన సొంత ఊరికి గర్వంగా వెళ్తున్నానని అన్నారు. ‘‘నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ, అక్కినేని నాగార్జునకి థాంక్స్. యుద్దమే కాదు.. సక్సెస్‌ని కూడా ప్రశాంతంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాను. నాగార్జున గారే హీరో అనుకుని ప్రతీ సీన్‌ను వివరించేవాడ్ని. నన్ను ఈ జర్నీలో ఆయన ఎంతో నమ్మారు. నవీన్ నూలి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. తమన్ ఎంతో సహరించారు. డీఓపీ బ్రిట్టోతో నాకు మంచి ర్యాపో ఉంటుంది. అఖిల్ చాలా మంచి వ్యక్తి. ఆయన డెడికేషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. భాగ్యశ్రీ బోర్సే.. ఇకపై నవ్వుతూనే ఉండండి. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’’ అని అన్నారు.* ‘నాగార్జున మీద ఒట్టేసి చెప్తున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే బెస్ట్ యాక్టర్ అఖిల్’.. రామ్ గోపాల్ వర్మ పోస్ట్ వైరల్'లెనిన్' మూవీ ఘన విజయం సాధించడంతో మురళీ కిషోర్ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆయనకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దర్శకుడు తన తదుపరి
చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది.ఇకపోతే 'లెనిన్' మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్ సీస్ లో 500K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని నంబర్స్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.