
ఇల్లు అంటే నాలుగు గోడలు మాత్రమే కాదు.. మన ప్రశాంతత, భద్రత, కుటుంబ బంధాలు ఉండే అందమైన ప్రదేశం. అందుకే ఇంటికి ఎవరిని ఆహ్వానిస్తున్నాం, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాం అనే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎలాంటి వారితో సన్నిహితంగా ఉండాలి? ఎలాంటి వారి వల్ల నష్టం కలగవచ్చనే విషయాలపై అనేక సూచనలు కనిపిస్తాయి. మరి ఎలాంటి వారిని ఇంటికి అస్సలు రానివ్వకూడదో ఇక్కడ చూద్దాం. బయటకు ఎంతో మంచివారిలా కనిపిస్తూ, అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గరవుతూ, అవకాశం దొరికితే మనకు నష్టం కలిగించే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్య నీతి సూచిస్తోంది. ముఖ్యంగా మన వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను ఇలాంటి వారి ముందు చర్చించడం సమస్యలకు దారితీయవచ్చు. మాటలతోనైనా, చేతలతోనైనా ఇతరులను బాధపెట్టడం అలవాటుగా ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ఇంటి ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. ఎప్పుడూ గొడవలకు దిగడం, ఇతరులను అవమానించడం, చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఇంట్లోకి వచ్చే వ్యక్తి వల్ల కుటుంబ సభ్యుల్లో భయం లేదా అసౌకర్యం ఏర్పడుతున్నట్లయితే వారిని దూరంగా పెట్టడం మంచిదని చాణక్య నీతి గుర్తు చేస్తోంది. నమ్మకాన్ని ఉపయోగించుకుని ఇతరుల నుంచి డబ్బు లేదా ప్రయోజనాలు పొందేవారితో దూరంగా ఉండటం మంచిది. చాణక్య నీతిలో నమ్మకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా మన బలహీనతలు, కుటుంబ పరిస్థితులు తెలిసిన వ్యక్తి వాటిని మనకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి తరచూ వచ్చే వ్యక్తి మన వ్యక్తిగత విషయాలను బయటకు చెబుతున్నాడా? మన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడా? అనే విషయాన్ని గమనించాలి. మన చుట్టూ ఉన్నవారి ప్రభావం మన ప్రవర్తనపై కూడా పడుతుంది. ముఖ్యంగా చెడు అలవాట్లను సాధారణమైనవిగా