
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cauliflower gobi dishes ban in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఒకవైపు వీకెండ్ , మరోవైపు శ్రావణ మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో విపరీతంగా భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం 31 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు వేచి ఉన్నారు. అంతే కాకుండా శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. టీటీడీ భక్తులకు అల్పాహరం, తాగునీటి సదుపాయాల్ని కల్పిస్తుంది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంది. తిరుమలలో ప్రస్తుతం ప్రతి బుధవారం రోజు ఎస్ఎస్ డీ టొకెన్ల జారీని నిలిపివేశారు. ఇక ఎస్ ఎస్ డీ టొకెన్లు ఉన్నవారికి దర్శనాలకు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. రూ. 300 టొకెన్లు ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇక తిరుమలలో రీల్స్, రాజకీయాలు మాట్లాడటంపై టీటీడీ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అయితే.. టీటీడీ తిరుమలలో కాలీఫ్లవర్ వంటకాన్ని నిషేధించింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో.. తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. ఇటీవల తిరుమల ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేకచోట్ల గోబీల్లో పురుగులు, కీటకాలు ఉండటంను అధికారులు గుర్తించారు. Read more: తిరుచానూరు ఆలయంలో నేత్రపర్వంగా వరలక్ష్మీ వ్రతం.. బంగారు చీరలో దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు! ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో చైనీస్