
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడిన భారీ నగదు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ.. జస్టిస్ వర్మను దోషిగా నిర్ధారించింది. తన నివాసంలో లభించిన నగదుకు సంబంధించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో వర్మ విఫలమయ్యారని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికను బుధవారం పార్లమెంటులో సమర్పించారు.2025 మార్చి 14 రాత్రి న్యూఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్‌లో ఉన్న జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడి స్టోర్‌రూంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన కరెన్సీ నోట్లు కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. "స్టోర్‌రూంలో వివరణ లేని రూ. 500 కరెన్సీ నోట్లు భారీగా లభించాయి. ఆ నగదుకు సంబంధించిన మూలాలు, యాజమాన్యంపై జడ్జి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు" అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.ఈ కేసులో తదనంతర దర్యాప్తు తీరును కూడా కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. "కీలకమైన సాక్ష్యాధారాలను సరిగా భద్రపరచలేదు. చట్టప్రకారం సీల్ చేసి, తనిఖీ చేయడానికి ముందే స్టోర్‌రూంలోని ఆధారాలను చెరిపేశారు. ఆ తర్వాత కరెన్సీ నోట్లు కనిపించకుండా పోవడంపై ఇప్పటికీ స్పష్టత లేదు" అని కమిటీ వ్యాఖ్యానించింది. అయితే, నగదును జడ్జి వ్యక్తిగతంగా తొలగించినట్లు తమకు ఆధారాలు లభించలేదని కమిటీ పేర్కొంది.నగదు ఉనికిపై 2025 మార్చి 22న వర్మ ఇచ్చిన సమాధానం సహా ఆయన వివరణలు "అసంతృప్తికరంగా" ఉన్నాయని కమిటీ