© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: సోమాలియా (Somalia) తీరంలో కామెరూన్ పతాకంతో వెళ్తోన్న ‘లుటుఫ్’ అనే కార్గో నౌక హైజాక్ (Cargo Ship Hijacked) అయ్యింది. తుర్కియే ఆయుధాలను తరలిస్తోన్న ఆ నౌకలో 10 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఆరుగురు భారతీయులే (Indians) అని స్థానిక అధికారులు వెల్లడించారు. మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారు. మొగడిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తుండగా.. సోమాలియాలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారన్నారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇంకా స్పందించలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఒక చిన్న పడవ మొదట నౌకను సమీపించింది. వారు అక్కడి నుంచి తీరానికి వెళ్లిపోయిన వెంటనే ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. అదే సమయంలో 8 మంది సముద్రపు దొంగలు నౌకను హైజాక్ చేశారు. ఈ ఘటనలో పడవలోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎవరు చేశారు?, మరణించిన వారికి హైజాక్‌తో సంబంధం ఉందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇదీ చదవండి: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.