
Hash Oil : గంజాయిని కలిగివుండటం ఇల్లీగల్... దీన్ని సాగుచేసినా, సరఫరా చేసినా, వాడినా శిక్ష తప్పదు. అయితే గంజాయి మొక్కలను పెంచి, ఆకులను ఎండబెడ్డి స్మగ్లింగ్ చేయడం గురించి తరచూ వింటుంటాం... ఒక్కోసారి పచ్చి గంజాయిని అక్రమంగా రవాణా చేసే ముఠాలు పట్టుబడటం గురించి వింటుంటాం. అయితే తాజాగా హైదరాబాద్ లో వింత గంజాయి రవాణా వ్యవహారం బైటపడింది... ఎండు గంజాయి లేదా పచ్చి గంజాయి కాదు ఏకంగా గంజాయి ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం గెమ్మెల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు శ్రీను, నిబియా గంజాయి ఆయిల్ (హ్యాష్ ఆయిల్) అక్రమ రవాణా దందా చేస్తున్నారు. వీళ్లు కొందరు యువకులను హ్యాష్ ఆయిల్ క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా కడుపు, కాళ్లకు కిలో చొప్పున రెండు హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లు అతికించుకుని ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 2 లీటర్ల చొప్పున మొత్తం 12 లీటర్ల హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. దీని విలువ రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు... ఈ ముఠా నుండి హ్యాష్ ఆయిల్ తో పాటు కొంత డబ్బు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ హ్యాష్ ఆయిల్ తో స్మగ్లింగ్ ముఠా పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే చాలామందికి గంజాయి గురించి తెలుసు కానీ ఈ హ్యాష్ ఆయిల్ గురించి తెలియదు... దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం. హ్యాష్ ఆయిల్ అనేది గంజాయి (క్యానబీస్) మొక్క నుండి తయారుచేసే ఒక శక్తివంతమైన ద్రవ రూప మాదకద్రవ్యం. దీనిని గంజాయి ఆకులు, పువ్వులు, కాండం నుండి ప్రత్యేక