© 2026 nimisham.in

ఇంటర్నెట్డెస్క్: వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump)తో కెనడా జరుపుతోన్న వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించడంతో చర్చలు (Canada Trade Talks) నిలిచిపోయాయి. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకునే 20 బిలియన్ల విలువైన వస్తువులపై 50 శాతం సుంకాలు విధించనున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. కెనడా ప్రతి ఏడాది ఆ దేశానికి ఎగుమతి చేసే సుమారు 5 శాతం వస్తువులపై ఇవి ప్రభావం చూపుతాయి. వీటన్నింటికీ సిద్ధమైన కెనడా.. చర్చల నుంచి వైదొలిగింది. ‘ఈ వారం ప్రారంభంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించింది. మా మార్కెట్లోకి వస్తువులను ఎగుమతి చేసే దేశాలన్నింటిలోనూ.. కెనడాకు అత్యుత్తమ ప్రాధాన్యత ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ వారు అంగీకరించలేదు. వారు కొత్త డిమాండ్లు లేవనెత్తడంతోపాటు మా నిబంధనల నుంచి వెనక్కి తగ్గడం వల్ల చర్చలు దెబ్బతిన్నాయి’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు. అమెరికా ప్రకటనపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) స్పందిస్తూ.. అగ్రరాజ్యం ప్రతిపాదించిన నిబంధనలలో చివరి నిమిషంలో చేసిన మార్పులు ఆర్థికంగా భారంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము కూడా అదే స్థాయిలో ప్రతీకార టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటినుంచే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ (Donald Trump) డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని కెనడా సర్కారు ఖండిస్తూ వస్తోంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశంపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్లు విధిస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా
సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.