
World Record T20 Match: క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని డేంజరస్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. బల్గేరియా, జిబ్రాల్టర్ జట్ల మధ్య జరిగిన పోరులో రన్ రేట్ ఏకంగా 14 దాటేసి సంచలనం సృష్టించింది. 244 పరుగుల కొండంత లక్ష్యాన్ని బల్గేరియా ఊహించని వేగంతో ఛేదించి, సరికొత్త చరిత్ర పుటల్లోకెక్కింది.! సోఫియాలోని నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఈసీఎన్ బల్గేరియా టీ20 టోర్నమెంట్ మ్యాచ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జిబ్రాల్టర్ జట్టు ఆరంభం నుంచే బాదుడే ధ్యేయంగా ముందుకు సాగింది. ఫిల్ రైక్స్ కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 73 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇయాన్ లాటిన్ 51 పరుగులతో మద్దతు ఇవ్వడంతో జిబ్రాల్టర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. బల్గేరియా బౌలర్లలో జాకబ్ గుల్ 4 వికెట్లు తీసి పరుగుల ప్రవాహానికి కాస్త అడ్డుకట్ట వేశాడు. ఎక్కువమంది చదివింది: Pakistan: డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..! 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బల్గేరియా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ ప్రారంభించింది. జిబ్రాల్టర్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి ఓవర్ నుంచే ఊచకోత కోశారు. ఇసా జరూ కేవలం 24 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి పునాది వేశాడు. మిలెన్ గోగేవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా తమవైపు తిప్పుకున్నాడు. వీరికి తోడుగా మనాన్ బషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మనాన్ బషీర్ కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 70 పరుగులు చేసి జిబ్రాల్టర్ ఆశలపై నీళ్లు చల్లాడు. బల్గేరియా ఆటగాళ్ల విధ్వంసకర