© 2026 nimisham.in
BSNL Rs 51 Offer: మొబైల్ రీఛార్జ్ రేట్లు భారీగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడీయాలు మరోసారి రీఛార్జ్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో సంచలనానికి తెరతీసింది. సరికొత్త కస్టమర్లను నెట్‌వర్క్‌లోకి స్వాగతించేందుకు రూ.51 ప్లాన్ లాంచ్ చేసింది. అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. సాధారణంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లలో ఒక రోజు డేటా బూస్టర్ వచ్చే ధరకే బీఎస్ఎన్ఎల్ ఏకంగా 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుండడం విశేషం. బీఎస్ఎన్ఎల్ రూ.51 ప్లాన్ వివరాలుకొత్త కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డును పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఈ సిమ్ యాక్టివేషన్ కోసమే రూ.51 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా పూర్తి 28 రోజుల పాటు సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఎలాంటి పరిమితిలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రతి రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజులకు గాను మొత్తం 56 జీబీ డేటా మీ సొంతం అవుతుంది. వీటితో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు.పరిమిత కాలం ఆఫర్బీఎస్ఎన్ఎల్ అధికారికంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆఫర్ వివరాల ప్రకారం ఇది పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ప్రమోషనల్ ఆఫర్ గా తెలుస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు, ఇతర నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది. పాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఈ రీఛార్జ్ చేసుకోలేరు. ఈ ఆఫర్ పొందడానికి కస్టమర్లు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్ దుకాణాన్ని సందర్శించి ఆధార్ కేవైసీ పూర్తి
చేసి కొత్త సిమ్ పొందాల్సి ఉంటుంది. అలాగే ఇతర వివరాలు, సందేహాలు ఉంటే బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ 1800 180 1503ని సంప్రదించవచ్చని తెలిపింది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారానూ వివరాలు పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ ఆగస్టు 31, 2026 వరకే అందుబాటులో ఉంటుందని నొక్కి చెప్పింది. ఉచిత సిమ్ కార్డుతో పాటు నెల రోజుల పాటు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లు లభిస్తాయని పేర్కొంది.