బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానం, బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం, కేసీఆర్ కుటుంబంతో తన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత వల్ల ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఒక్కసారైనా ఆలోచించుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య విభేదాలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నించానని గుర్తు చేసుకున్నారు. వారిని విడదీయడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను ఏం చేశానో కేసీఆర్కు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే.. కవితపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా కవిత నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్వలాభం కోసం ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలకు కవిత ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.బీఆర్ఎస్తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన ప్రశాంత్ రెడ్డి.. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి, తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ఆవిర్భావానికి ముందే ఉద్యమ రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. పార్టీ ప్రారంభ దశ నుంచి తమ కుటుంబం బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ప్రశాంత్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. కవిత మధ్యలోనే పార్టీలోకి వచ్చారని.. ఇప్పుడు మధ్యలోనే వెళ్లిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం, పార్టీ నిర్మాణంలో తమ కుటుంబం పోషించిన పాత్రను గుర్తు చేశారు.ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసీఆర్కు అండగా ఎవరు నిలుస్తున్నారో కవిత తెలుసుకోవాలని ప్రశాంత్