© 2026 nimisham.in

ప్రకృతిని కాపాడటానికి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి. కానీ, బ్రిటన్కు చెందిన ఓ యువతి ఏకంగా నదినే పెళ్లి చేసుకుని, ఇప్పుడు దాని హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్ధమైంది. యూకేలోని జలవనరుల్లోకి శుద్ధి చేయని మురుగునీటిని వదులుతున్నారనే ఆవేదనతో, ఏవాన్ నది దుస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి 2023లో మెగ్ అనే 28 ఏళ్ల యువతి ఆ నదిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తన పేరును 'మెగ్ ఏవాన్'గా మార్చుకుని, ఆ నదికి తాను భార్యనంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు తన పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఏవాన్ నదికి చట్టపరమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఓ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టింద.ఈ లక్ష్య సాధన కోసం మెగ్ ఏవాన్, యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ (UWE) పరిశోధకులతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా న్యాయశాస్త్ర పరిశోధకురాలు ఎలెనా బ్లాంకో సహకారంతో నదికి చట్టపరమైన రక్షణ కల్పించే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా, యూకేలోనే తొలిసారిగా ఒక నది కోసం 'క్రాస్-కౌన్సిల్ రివర్ చార్టర్'ను రూపొందిస్తున్నారు. నార్త్ విల్ట్షైర్, బాత్ అండ్ నార్త్ ఈస్ట్ సోమర్సెట్, బ్రిస్టల్ సిటీ, సౌత్ గ్లౌసెస్టర్షైర్ కౌన్సిళ్లను ఈ ప్రయత్నంలో భాగం చేస్తున్నారు. ఏవాన్ నదిని ఓ 'జీవించే అస్తిత్వం'గా (living entity) అధికారికంగా ప్రకటించి, దానికి చట్టపరమైన హక్కులు కల్పించడమే ఈ చార్టర్ ముఖ్య ఉద్దేశం.ఈ ఉద్యమం వెనుక ఉన్న ఆలోచన కేవలం గణాంకాలు, డేటాతో ప్రజలను చైతన్యపరచడం కాదు. నదులతో మానవాళికి ఉన్న భావోద్వేగ బంధాన్ని గుర్తుచేయడం ద్వారా వారిలో