
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురయ్యే అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా పౌరులు తమ గళాన్ని వినిపించడానికి ఓ నూతన డిజిటల్ ప్లాట్ ఫామ్ తెరపైకి వచ్చింది. దీనిద్వారా ప్రజలు తమకు ఎదురైన లంచం, అవినీతి, అధికారులు, సిబ్బంది ప్రవర్తన.. వంటి వివరాలను నమోదు చేయవచ్చు. ప్రభుత్వ విధానాలలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన ఓ వినూత్న ప్రయత్నం ఇది.అదే Bribes.fyi. సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్యన్ నిషాద్ రూపొందించిన ఈ వెబ్సైట్ ఇది. సాధారణ ఆన్లైన్ నివేదికల పోర్టళ్లలా కాకుండా, ఈ సైట్ లో వివరాలు నమోదు చేయడానికి వినియోగదారులు నిర్దుష్టంగా ఎటువంటి అకౌంట్ నూ వినియోగించాల్సిన అవసరం లేదు. వారి ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదు. ఫిర్యాదిదారుల వివరాలన్నీ కూడా రహస్యంగా ఉంచుతారు. కనీసం ఈమెయిల్ ఐడీని కూడా అందులో పొందుపర్చనక్కర్లేదు.లంచం అడిగిన ప్రభుత్వ శాఖ పేరు, ఆ ఘటన చోటు చేసుకున్న ప్రాంతం, డిమాండ్ చేసిన లంచం మొత్తం, దాన్ని తాము చెల్లించారా లేదా అనే ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇక్కడ పంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమాచారాన్ని నమోదు చేసే పౌరుల భద్రతకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. బాధితుల నుంచి సేకరించిన సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న లంచాల వివరాలు, వాటి సరళిని ఈ పోర్టల్ క్రోడీకరిస్తుంది.రైతు రుణమాఫీని ప్రకటించిన సీఎం విజయ్: వీరికి సంపూర్ణ వర్తింపుఆగస్టు 15 వరకు దేశంలో 251 నగరాల నుంచి లంచానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి. 616 లంచం కేసుల వివరాలు ఇందులో నమోదయ్యాయి. అత్యధికంగా పోలీస్ శాఖలో 337 లంచం డిమాండ్లు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత రవాణా శాఖ రెండో స్థానంలో నిలిచింది. ఆర్టీఓల్లో 88 లంచం కేసులు రికార్డయ్యాయి. రెవెన్యూ, భూ రికార్డుల విభాగంలో 69, పాస్పోర్ట్ కార్యాలయాలలో 43, మున్సిపల్ కార్పొరేషన్లలో 29 కేసులు ఉన్నట్లు తేలింది.ఉజ్జయినీ ఆలయం క్యూలైన్ లో భారీగా తొక్కిసలాట