
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి పయనమయ్యారు. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా కలవనున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సైతం దిల్లీకి చేరుకున్నారు. అధిష్ఠానం పిలుపు.. దిల్లీకి కొండా సురేఖ
|