
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలపై ప్రభుత్వానికి ఊరట దొరికింది. ఈ పథకాల అమలుపై సింగిల్‌బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. సింగిల్‌బెంచ్ స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లో యువతుల పెళ్లికి ప్రభుత్వం సాయం చేస్తోందని, పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని అడ్వొకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టులో వాదించారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలపై ప్రభుత్వానికి ఊరట
|