
సామాజిక మాధ్యమాల వేదికలపై కనిపించే అశ్లీల (పోర్న్) యాప్ల ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని సెల్ఫోన్ యూజర్లను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) హెచ్చరించింది. ఆ యాప్ల ముసుగులో ప్రమాదకర మాల్వేర్ సెల్ఫోన్లలోకి చొరబడుతుందని తెలిపింది. వీటి ద్వారా జరిగే ఆర్థిక మోసాలు ఇటీవల బాగా పెరిగాయని వెల్లడించింది. ఈ యాప్లు ఫోన్ డివైజ్ను తమ నియంత్రణలోకి తీసుకుని, అనధికార ఆర్థిక లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. వివరాలకు.. అశ్లీల యాప్ ముసుగులో మాల్వేర్ చొరబాటు
|