
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ దేశం ఆర్థిక, సైనిక ఒత్తిడిలో ఉందని ఆరోపిస్తూ, వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తాను హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్, వాషింగ్టన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రస్తుతం ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ట్రంప్ చెప్పారు. హర్మూజ్ మా భూభాగం.. ట్రంప్ హెచ్చరిక
|





