
తెలంగాణకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. ఐటీ ఏరియాలో భూమి అంటే బంగారం కంటే ఎక్కువేనని తాజాగా రాయదుర్గంలో నిర్వహించిన ఈ-వేలంలో తేలింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లు పలికి సరికొత్త రికార్డును సృష్టించింది. మొత్తం 5.25 ఎకరాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఒక్క రోజులో రూ.1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరడం హైదరాబాద్ రియల్ఎస్టేట్ సత్తాను చాటింది. రాయదుర్గంలో కురిసేనా కనకవర్షం
|





