
ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లిస్తున్న నేపథ్యంలోనే ధరలు పెరుగుతున్నాయన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. దేశంలో అనుకున్నంత ఉత్పత్తి లేకపోవడం, పండుగల సీజన్ వల్ల చక్కెర ధరలు పెరుగుతున్నట్లు తెలిపింది. ధరలను అదుపులో ఉంచేందుకు నిల్వలపై పరిమితులు విధింపు, సుంకాలు లేని దిగుమతులు చేసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్లో ఉత్పత్తి అవుతున్న మూడోవంతు ఇథనాల్ ధాన్యం నుంచే వస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. చక్కెర ధర పెరగడంపై ఆరోపణలు.. కేంద్రం క్లారిటీ
|