
సీఎం రేవంత్‌రెడ్డిపై తన కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. తాను ఇప్పుడు మీడియాతో మాట్లాడనని, చెప్పాల్సింది నిన్ననే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతం సీఎం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సీఎం వచ్చాక మాట్లాడతా.. కొండా సురేఖ
|