
సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు బిహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వీడియోలు తీసి వైరల్ చేస్తే.. రూ.లక్ష వరకు నగదు బహుమతి అందుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా పాలసీలో చేసిన సవరణలకు.. బిహార్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం సాధించిన ఘనతలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్‌తో క్రియేటర్లు వీడియోలు రూపొందించి నగదు అందుకోవచ్చు. ⇒ వివరాలు వాటిపై వీడియోలు చేస్తే.. రూ.లక్ష క్యాష్‌ప్రైజ్
|