
ఉత్తర కెన్యాలో హెలికాఫ్టర్ కూలి ఏడుగురు మృతి చెందగా, వీరిలో ఐదుగురు అమెరికన్లు ఉన్నారు. కెన్యాలోని సంబూరు కౌంటీలోని లోయిసాబా కన్సర్వెన్సీ నుండి ఇవాసో నైరో ప్రాంతానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, పైలట్‌తో సహా ఏడుగురు ఉన్నారని పేర్కొంది. వాషింగ్టన్‌లోని విదేశాంగ శాఖ మృతులలో ఐదుగురు అమెరికా పౌరులు అని పేర్కొంది. మృతుల్లో ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ జోస్ సువెరెజ్, ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ అధిపతి సెన్సీ ఉన్నారు. ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్: ఏడుగురి మృతి
|





