
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి వద్ద ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమ జంటకు విద్యుదాఘాతం కావడంతో గాయపడ్డారు. ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్, నల్లమాడ మండలానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బత్తలపల్లి వద్ద ఏకాంతంగా ఉన్న సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ⇒ మరిన్ని వివరాలు ఏకాంతంగా గడిపేందుకు వెళ్తే.. కరెంట్ షాక్
|