
హ్యుందాయ్ మోటార్ ఇండియా మరోసారి కార్ల ధరలను పెంచింది. సెప్టెంబర్ నుంచి అన్ని వేరియంట్లపై ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో కార్ల ముడిసరుకుల ధరలు పెరిగాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వినియోగదారులపై ఈ ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. అయితే వ్యయ ఒత్తిళ్ల కారణంగా వినియోగదారులకు స్వల్పంగా బదిలీ చేసినట్లు చెప్పింది. హ్యుందాయ్ కార్లు మరింత ప్రియం
|