
సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన భారాస నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతి లేదంటూ బుధవారం పోలీసులు కోకాపేటలోని అతని ఇంటివద్ద హౌస్ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. విషయం తెలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హరీశ్‌రావు ఇంటికి చేరుకొన్నారు. హరీశ్‌రావుతో పాటు తలసాని, సబితా ఇంద్రారెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్టు
|