
త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు. త్వరలో రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి
|