
ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు రాజకీయ అధికారం దక్కిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెదేపాలో ఎంతో మంది బీసీలు నేతలుగా ఎదిగారని శాసనసభలో జరిగిన చర్చలో సీఎం పేర్కొన్నారు. 1995లో బీసీలకు ఉన్న 20% రిజర్వేషన్లను 34%కి పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. 34% రిజర్వేషన్ బీసీలకు రాజకీయంగా అవకాశద్వారమని.. వారి జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయమిదని చంద్రబాబు పేర్కొన్నారు. ⇒ మరిన్ని వివరాలు ‘బీసీల జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయమిది’
|