
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) తరహాలోనే మహిళల ఏపీఎల్ నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని ప్రకటించారు. మంగళగిరి వేదికగా సెప్టెంబరు 15 నుంచి 26వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘మహిళల ఏపీఎల్‌లో 4 జట్లు పోటీ పడుతున్నాయి. టీమ్‌లకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్.. ఒక జట్టుకు బిడ్ వేసింది’’ అని తెలిపారు. మహిళల ఏపీఎల్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపారు. సెప్టెంబరు 15 నుంచి మహిళల ఏపీఎల్
|





