
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 నియామకాల ఊసే లేదని, ఒకసారి నియమకాలు చేపట్టినా పల్లీ బటానీల్లా ప్రశ్నపత్రాలు అమ్మారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్ఎంపీ డాక్టర్ని పబ్లిక్ సర్వీస్ సభ్యుడిని చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని తెలిపారు. హిందూ, ముస్లింలను వేర్వేగా చూడనని, రెండు కళ్లలా చూస్తానని అన్నారు. RMPని ‘పబ్లిక్ సర్వీస్’ సభ్యుడిని చేశారు: రేవంత్రెడ్డి
|





