
త్వరగా క్యాబ్ దొరుకుతుందనే ఆశతో అదనపు చెల్లింపు చేయడానికి ప్రయాణికులను ప్రోత్సహించకూడదని పేర్కొంటూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ, మోటార్ వెహికల్ అగ్రిగేటర్లకు సూచించింది. తమ యాప్‌ల నుండి ప్రయాణానికి ముందు టిప్ ఇవ్వమని అడగకూడదని ఆదేశించింది. బుకింగ్ ప్రక్రియ సమయంలో రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ముందస్తు టిప్ , యాడ్-ఆన్‌ను ఎంచుకోండి, మీ రైడ్ త్వరగా ఖరారయ్యే అవకాశాలను మెరుగుపరచుకోండి వంటి సందేశాలను ప్రదర్శిస్తున్నాయని వచ్చిన నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ‘ప్రయాణించక ముందే టిప్’ ఇకపై రైడ్ యాప్‌ల్లో కుదరదు
|