
అమెరికాలోని మసాచుసెట్స్‌లోని తమ ఇంటిలో తల్లిని, తమ్ముడిని హత్య చేసినట్లు భారతీయ మూలాలున్న 17 ఏళ్ల బాలుడిపై అక్కడి అధికారులు అభియోగాలు మోపారు. 17ఏళ్ల అర్జున్ అరవింద్, తన తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ (14), తల్లి సుధా వెంకటేశన్ (45) మరణాలకు సంబంధించి రెండు హత్యలు, మోటారు వాహనం దొంగిలించడం వంటి నేరాలపై అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వారి మరణానికి కచ్చితమైన కారణం వెలువడలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు బాలుడిపై కేసు నమోదైంది. తల్లి, తమ్ముడిని హత్య చేసినట్లు భారతీయ బాలుడిపై అభియోగాలు
|