
వరంగల్: తెలంగాణలో మావోయిజం దాదాపు పూర్తిగా కనుమరుగైందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మావోయిస్టు బాధిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వరంగల్‌లో పర్యటిస్తున్న ఆయన.. ఐపీఎస్‌గా తన ప్రస్థానం ఈ జిల్లాలోనే ప్రారంభమైదని చెప్పారు. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ క్రైమ్ ప్రధాన సవాళ్లుగా మారాయన్నారు. సైబర్ నేరాలతో ప్రజలు భారీగా డబ్బు నష్టపోతున్నారని తెలిపారు. ఆన్లైన్లో అధిక లాభాల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ క్రైమే ప్రధాన సవాళ్లు: TG డీజీపీ
|





