
అమెరికా తన ప్రవర్తనను మార్చుకునేవరకూ హర్మూజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. నౌక దిగ్బంధం ఎత్తివేయాలని.. నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ తాజాగా డిమాండ్ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బెదిరించకూడదని పేర్కొంది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించింది. ఇరాన్ తాజా డిమాండ్లపై అమెరికా ఇంకా స్పందించలేదు. అప్పటివరకూ హర్మూజ్‌ను తెరవబోం..: ఇరాన్
|