
ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌తో భారత్ స్నేహపూర్వక మ్యాచ్‌ను ఆడొద్దని.. బాయ్‌కాట్ చేయాలని మాజీల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అనవసరమైన భారీ ఖర్చుతో మ్యాచ్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదనేది వారి వాదన. అందుకు వెచ్చించే నిధులను భవిష్యత్తు తరాల కోసం వినియోగించాలని మాజీ కెప్టెన్ భైఛుంగ్ భూటియా సూచించాడు. ఫ్రీగా వచ్చి ఆడితే తమకు అభ్యంతరం లేదనీ అతడు వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ సంఘం స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం భారత్ - బ్రెజిల్ జట్ల మధ్య అక్టోబర్ 3న స్నేహపూర్వక మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, బాయ్‌కాట్ వ్యాఖ్యల నేపథ్యంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్పందిస్తూ.. ‘‘షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడతాం. బయట జరుగుతోన్న చర్చ మాపై ప్రభావం చూపదు’’ అని స్పష్టం చేసింది. దీంతో బ్రెజిల్ ఆడేందుకు సిద్ధమైన సంకేతాలను పంపినట్లైంది. ‘‘అభిమానుల కోసం మేం భారత్‌కు వస్తున్నాం. గత ప్రపంచ కప్‌లో మా జట్టుకు భారతీయ ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. అందుకు కృతజ్ఞతగానే ఈ మ్యాచ్‌ను ఆడేందుకు అక్కడికి వస్తున్నాం. అలాగే గొప్ప ప్రదర్శన ఇవ్వడానికి భారత్‌కు వెళ్లడం సముచితం’’ అని బ్రెజిల్ జట్టు కోఆర్డినేటర్ రోడ్రిగో వ్యాఖ్యానించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు