
భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి అంతర్జాతీయంగా గిరాకీ అమాంతం పెరిగింది. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఈ క్షిపణి చూపిన అద్భుతమైన పనితీరు, దాని కచ్చితత్వం, విధ్వంసక శక్తి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆపరేషన్ తర్వాత బ్రహ్మోస్ కొనుగోలుకు పలు దేశాలు తీవ్ర ఆసక్తి చూపుతుండగా, ఇప్పటికే కొన్ని దేశాలతో భారీ ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. ‘ది వీక్’ పత్రిక ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఈ క్షిపణి కొనుగోలుకు చర్చలు వేగవంతమయ్యాయి.2022 జనవరిలో ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత్, ఆపరేషన్ సిందూర్ తర్వాత మరిన్ని విజయాలు సాధించింది. వియత్నాం సుమారు 629 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేయగా, ఇండోనేషియా కూడా 200 నుంచి 300 మిలియన్ డాలర్ల మధ్య విలువైన ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. యూరప్, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాకు చెందిన డజనుకు పైగా దేశాలు కూడా బ్రహ్మోస్ కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.ఆపరేషన్ సిందూర్‌తో పెరిగిన ప్రతిష్ఠపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్‌లోని కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, భారత వాయుసేన విమానాలు అంతర్జాతీయ సరిహద్దు దాటకుండానే సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులను పాక్ సైనిక స్థావరాలపై ప్రయోగించాయి. ఈ దాడుల కచ్చితత్వం, తీవ్రత పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ మోహరించిన చైనా నిర్మిత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించడం ఒక