© 2026 nimisham.in

ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ బాల ఆధార్ కార్డు తప్పనిసరి

యూఐడీఏఐ పోర్టల్ ద్వారా బాల ఆధార్ దరఖాస్తు చేయాలి

ఇంకా ఏయే డాక్యుమెంట్లు ఉండాలి? పూర్తి వివరాలివే

Blue Aadhaar Card : పేరెంట్స్ కు గుడ్ న్యూస్.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) భారత పౌరులందరికీ, వయస్సుతో సంబంధం లేకుండా నవజాత శిశువులకు కూడా 12 అంకెల ఆధార్ కార్డును జారీ చేస్తుంది. 5 ఏళ్ల లోపు పిల్లల కోసం బాల ఆధార్ అనే స్పెషల్ ఆధార్ కార్డును అందిస్తారు.

ఇది చూసేందుకు బ్లూ కలర్ లో ఉంటుంది. ఇందులో ఫింగర్ ఫ్రింట్స్ లేదా ఐరీస్ స్కాన్ల వంటి బయోమెట్రిక్ డేటా ఉండదు. కేవలం పిల్లల ఫోటోతో పాటు తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తారు. బాల ఆధార్ స్కూల్ అడ్మిషన్లకు ప్రభుత్వ ప్రయోజనాలకు గుర్తింపు కార్డుగా వాడుకోవచ్చు.

ఏయే డాక్యుమెంట్లు అవసరం :
బాల ఆధార్ కోసం అవసరమైన డాక్యుమెంట్లలో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఆస్పత్రి డిశ్చార్జ్ స్లిప్, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డు లేదా మరొక వ్యాలీడ్ అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి. తల్లిదండ్రులలో ఒకరి పాస్‌పోర్ట్, ప్రస్తుత నివాసానికి సంబంధించిన ఇతర ప్రూఫ్ ఒకటి తప్పక ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ ఎలా? :

బాల ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక UIDAI పోర్టల్‌ను సందర్శించాలి. మీ సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ తర్వాత మీ పిల్లలు, వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. 5 ఏళ్ల లోపు పిల్లలకు, కేవలం డిజిటల్ ఫోటో మాత్రమే తీసుకుంటారు. బాల ఆధార్‌ను తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ చేస్తారు. బాల ఆధార్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం.

Read Also : Bank of Baroda FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 444 రోజుల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

పిల్లలకు 5 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు వారి బయోమెట్రిక్ డేటాను అప్ డేట్ చేయించుకోవాలి. 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వయస్సు మధ్య పిల్లల 10 ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫోటోను ఫ్రీగా తీసుకుంటారు.

బ్లూ ఆధార్ ఏంటి? :
5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జారీ చేసే ఆధార్ కార్డులను బ్లూ ఆధార్ లేదా బాల్ ఆధార్ అంటారు.
ఆధార్‌ను వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌కు లింక్ చేస్తారు అనమాట. మీ పిల్లలకు 15 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు అందరిలానే నార్మల్ ఆధార్ కార్డును అందజేస్తారు. బాల ఆధార్ నెంబర్ తోనే ఈ ఆధార్ కార్డును జారీ చేస్తారు.