భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతర్గంగా ఒక భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీకి కొత్త రూపును ఇచ్చే ప్రక్రియ పూర్తయిందని, కొత్త బృందాన్ని రేపటికల్లా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. అనుభవజ్ఞులైన సీనియర్లు, కీలక మంత్రులతో పాటు యువతకు, మహిళా నాయకులకు పెద్దపీట వేయనున్నారు. 2029 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ ముందస్తు కసరత్తు జరుగుతోంది. పార్టీ కొత్త కూర్పు ఖరారైన వెంటనే, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు సూచిస్తున్నాయి.నితిన్ నబిన్ పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతోంది. ఈ కొత్త సంస్థాగత నిర్మాణంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాతీయ అధికార ప్రతినిధులు, పార్టీలోని వివిధ విభాగాల అధిపతులతో సహా కీలక కార్యవర్గ సభ్యులుగా కొత్తవారిని నియమిస్తారని సమాచారం. ఇటీవల విద్యార్థి ఉద్యమం నేపథ్యలో యువతను చేరువ చేసే కార్యక్రమాలను బలోపేతం చేసి, వారిని పార్టీవైపు ఆకర్షించేందుకు వీలుగా యువకులకు పార్టీ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ.. పార్టీ సంస్థాగత మార్పుల వార్తలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభా కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లోనే పలు దఫాలుగా సీనియర్ నేతలతో ఉన్నత స్థాయి అంతర్గత సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల తర్వాతే కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ, నీట్ నిరసనల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులతో పాటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుందని తెలుస్తోంది.బంకీపూర్ ఓటమితో ఆత్మపరిశీలన పార్టీ స్థానాల్లో మార్పులు చేర్పులకు ప్రధాన కారణం ఇటీవల ఉప-ఎన్నికల్లో ఎదురైన ఓటమేనని తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తున్న