
Mancherial: మంచిర్యాలలో కొత్త పెన్షన్లకై డిమాండ్ బీజేపీ ధ్వజం! Mancherial: మంచిర్యాల అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోగా, ఇప్పటికే మంజూరైన లబ్ధిదారుల పెన్షన్లను తొలగించవద్దని హెచ్చరించారు కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులు తదితర అర్హులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ముకేశ్ గౌడ్, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, బోట్ల అనిత సత్యం తదితరులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు
.