
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్‌కు చెందిన షాపింగ్ స్టార్టప్ ‘ఫియా’ (Phia) తీవ్రమైన ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. ‘కుకీ స్టఫింగ్’ అనే మోసపూరిత టెక్నిక్‌ను ఉపయోగించి అక్రమంగా ఆదాయం పొందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ తరహా చర్యలను తీవ్రమైన ‘ఫెడరల్ వైర్ ఫ్రాడ్’గా పరిగణిస్తారు. ఒకవేళ నేరం రుజువైతే గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు కాలేదు.అసలేమిటీ ‘కూకీ స్టఫింగ్’?వినియోగదారులు ఒక వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, వారు ఆ సంస్థ అందించే కూపన్లు లేదా ఇతర సేవలను వాడకపోయినా సరే, వారి బ్రౌజర్లో బలవంతంగా ట్రాకింగ్ కుకీలను చొప్పించడాన్ని ‘కుకీ స్టఫింగ్’ అంటారు. దీనివల్ల ఆ తర్వాత యూజర్ ఏదైనా కొనుగోలు చేస్తే, ఆ అమ్మకానికి తామే కారణమని చెప్పి ఆన్లైన్ రిటైలర్ల నుంచి ఈ సంస్థ అక్రమంగా కమీషన్లు పొందుతుంది.బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఫియా స్టార్టప్‌లో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సహ వ్యవస్థాపకులైన ఫోబీ గేట్స్, సోఫియా కియానీలకు కనీసం ఏడు నెలల ముందు నుంచే తెలుసని అంతర్గత సమాచారం సూచిస్తోంది. నైక్, గ్యాప్, నార్డ్‌స్ట్రామ్ వంటి ప్రముఖ రిటైలర్ల అమ్మకాలను ఈ విధానం ప్రభావితం చేసిందని, కంపెనీ చూపిన మొత్తం ఆదాయంలో అధిక భాగం దీని ద్వారానే వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది.ఈ ఆరోపణలు బయటకు రావడంతో జులై 7న ఈ ఫీచర్‌ను నిలిపివేసినట్లు