
అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఒక కీలక రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు, భద్రతా కారణాల దృష్ట్యా అసలు విమానానికి బదులుగా ఒక డెకాయ్ (మాయ) విమానాన్ని వాడారని, ఈ విషయాన్ని ప్రభుత్వం జర్నలిస్టులకు ముందుగానే తెలిపిందని ఓ సీనియర్ వైట్ హౌస్ జర్నలిస్ట్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తుర్కియే పర్యటనలో ఇలాంటి వ్యూహాన్నే అనుసరించారన్న వార్తల నేపథ్యంలో ఈ పాత ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.‘ది వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం.. యూఎస్ఏ టుడే వాషింగ్టన్ బ్యూరో చీఫ్ అయిన సూసన్ పేజ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. 2000 సంవత్సరంలో ఆమె వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. క్లింటన్ భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే ముందు, వైట్ హౌస్ అధికారులు తనను ఆఫ్-ది-రికార్డ్ సమావేశానికి పిలిచారని ఆమె తెలిపారు. "పాకిస్థాన్‌కు వెళ్లడంలో ఉన్న ప్రమాదాల కారణంగా తీసుకుంటున్న అసాధారణ భద్రతా చర్యల గురించి వారు నాకు వివరించారు. అందులో డెకాయ్ విమానాన్ని ఉపయోగించడం కూడా ఒకటి. ఆ ముప్పు కేవలం క్లింటన్కే కాదు, పర్యటనను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు కూడా ఉందని చెప్పారు" అని సూసన్ పేజ్ పేర్కొన్నారు.క్లింటన్, ట్రంప్ వ్యూహాల్లో తేడా2000 మార్చిలో ఇస్లామాబాద్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ తరహా విమానం ఒకటి ల్యాండ్ అయింది. అందులో నుంచి క్లింటన్‌ను పోలిన ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బయటకు