రంభ ఊర్వశి మేనక

Bigg Boss 10 Day 1 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిన్న ఘనంగా మొదలయింది. హౌస్ లోకి 16 మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే 10 స్పెషల్ పవర్స్ పెట్టి ఆ పవర్స్ గెలుచుకోటానికి నిన్నే టాక్సులు పెట్టిన సంగతి తెలిసిందే. త్రిగుణ్, ఝాన్సీ, రామ్ ప్రసాద్, షాలిని పటేల్, నరేష్, సృష్టి, వర్షిణి , నిహార్ లు గెలుచుకున్నట్టు నిన్న చూపించారు.

నేడు మిగిలిన రెండు పవర్ కీస్ ని మిగిలిన వాళ్లలో ఎవరికి ఇవ్వొచ్చో కీస్ గెలుచుకున్న వాళ్ళు డిసైడ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ అనుకోని వంశీ, కృష్ణుడుకు పవర్ కీస్ ఇచ్చారు. దీంతో వేరే వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వలేదు అని గొడవ పెట్టుకున్నారు. వంశీ, కృష్ణుడు వెళ్లి కీస్ తీసుకున్నారు. అయితే ఈ కీస్ గెలుచుకున్న పది మందికి మాత్రమే బెడ్ రూమ్ యాక్సెస్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు బయటే పడుకోవాలి.

దేబ్జానీ మోదక్ కి నాగార్జున ఇచ్చిన 18 బ్యాడ్జీలు బాక్స్ ని చూసుకుంటూ ఎవరికీ ఏం ఇవ్వాలా అని ఆలోచించుకుంది. సుధీర్ రెడ్డి, ఇంకొంతమంది త్రిగున్ అందర్నీ డామినేట్ చేస్తున్నాడు అని డిస్కస్ చేసుకున్నారు. అనంతరం అందరూ పడుకున్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత ఏషనాగుల సాంగ్ వేయడంతో అంతా డ్యాన్స్ వేశారు. రామ్ ప్రసాద్ – దేబ్జానీ అన్నాచెల్లెళ్లు అంటూ కాసేపు ఎమోషన్ పండించారు. అనంతరం వంట చేసుకున్నారు. దేబ్జానీ మైక్ బ్యాటరీ మార్చుకోవడం మర్చిపోయింది. దాంతో బిగ్ బాస్ ని కాకా పట్టింది. త్రిగున్ కి దయ్యాలు ఉన్నాయని నమ్మించమనే టాస్క్ ఇచ్చారు కాబట్టి ఆ పనిలో ఉన్నాడు. సుధీర్ రెడ్డి సృష్టిని ఫ్లర్ట్ చేసే పనిలో ఉన్నాడు. రామ్ ప్రసాద్ – నరేష్ నామినేషన్స్ కోసం మాట్లాడుకున్నారు. దేబ్జానీ ని బిగ్ బాస్ తనపై అభిప్రాయం ఏంటి అని అడిగాడు. కాసేపు దేబ్జానీ – బిగ్ బాస్ మాట్లాడుకున్నారు.

Also See : Jabardasth Ram Prasad : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఆటో రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?

అనంతరం బిగ్ బాస్ పవర్ కీస్ గెలుచుకున్న వాళ్లలో ఒక్కొక్కరిని పిలిచి పవర్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పవర్ ఏంటో తెలుసుకోమన్నాడు. దాంతో అందరూ తమకు వచ్చిన బాక్స్ లను ఓపెన్ చేసుకొని వాళ్లకు వచ్చిన పవర్స్ తెలుసుకున్నారు.

త్రిగున్ కి వచ్చిన పవర్.. వేరే ఎవరైనా ప్లేయర్ తన పవర్ ని వాడినప్పుడు త్రిగున్ తన పవర్ వాడి ఆ పవర్ ని తీసేసుకోవచ్చు. అయితే అలా తీసుకున్న పవర్ ని వెంటనే వాడాలి.