
బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభానికి ముందే అగ్నిపరీక్ష హీటెక్కిస్తుంది. కామనర్స్ తమ విభిన్నమైన స్టోరీస్ చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాము పడ్డ స్ట్రగుల్స్ చెబుతూ ఎమోషనల్‌కి గురి చేస్తున్నారు. అగ్నిపరీక్ష మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజా ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. అందులో భాగంగా వైజాగ్ నుంచి ఒక శివ శ్రష్టి వ్యాకరణం అనే అమ్మాయి వచ్చింది. తాను ఫేస్ చేసిన విషయాలను పంచుకుంది. అందులో భాగంగా తాను 11 ఏజ్ నుంచి ర్యాంప్ మోడల్ చేస్తుందట. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. అయితే కాలేజీలో ఒకరోజు ఇలా ర్యాంప్‌కి వెళ్తానంటే చెవు మీద గట్టిగా కొట్టాడట. దెబ్బకి చెవి పగిలిపోయిందట. అంత గట్టిగా కొట్టాడట. ఆ దెబ్బతో బ్రేకప్ చెప్పిందట. అతనిపై కోపంతో, తనని అవమానించిన దానికి ప్రతీకారంగా ఆమె తానేంటో ఎదిగి చూపించింది. అంతేకాదు తాను చదువుతున్న కాలేజీకే ఈవెంట్‌కి జడ్జ్ గా వెళ్లడం విశేషం. దెబ్బకి ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయట. ఇందులోనే మరో అమ్మాయి వచ్చింది. డయానా రాజకుమారి. రాజా నగరం నుంచి వచ్చింది. ఆమె తన పెళ్లి విషయంలో పడ్డ బాధని పంచుకుంది. తనకు ముగ్గురు పిల్లలు అట. తాను నల్లగా ఉన్నా అనే కారణంగా మూడు నెలల తర్వాత భర్త తన బాబాయ్ కూతురుని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడట. తనని ఏ కారణం చెప్పి రిజెక్ట్ చేశారో, దాన్నే మరింత బలంగా మార్చుకోవాలనుకుందట. ఇది విని జడ్జ్ లు బిందు మాధవి, అభిజీత్, నవదీప్ షాక్ అయ్యారు. ఆ తర్వాత బిందు మాధవి మూడు పేపర్లు ఇచ్చి అందులో హస్బెండ్ అని రాసిచ్చింది. తన బాధని బయటపెట్టమని చెప్పింది. నిజంగా పెళ్లాన్ని, పిల్లల్ని పెంచే స్తోమత లేని వాళ్లు పెళ్లి చేసుకోకూడదని వెల్లడించింది. వాళ్ల లైఫ్‌ని వాళ్లు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా అని చెప్పింది. మరో