. అందుకే వదిలేశా.. అని చరణ్ కౌంటర్ వేస్తే.. అందరూ నవ్వేస్తారు. ఆ తర్వాత ఆ నలుగురిని బజ్ ఇంటర్వ్యూ చేస్తాడు చరణ్. ఆ తర్వాత అందరూ కలిసి గ్రీన్ ఇస్తారు. ఒక వేళ రెడ్ ఇచ్చి ఉంటే ఏం చేసేవాడివి అంటే.. ఆహార దీక్ష చేసే వాడ్ని.. తింటూ బాధ పడేవాడ్ని అని మళ్లీ కామెడీ చేస్తాడు చరణ్. ఫుల్ ఎంటర్టైనింగ్గా, హానెస్ట్‌గా ఉన్నావ్ అని టాప్ 15లోకి పంపించేస్తారు.దీబ్ జాన్ అని ఓ కంటెస్టెంట్ వస్తారు. బ్రేక్ వల్లే బెస్ట్‌గా మారానని, ఇప్పుడు ఇంకో రిలేషన్లో ఉన్నాను అని చెబుతుంది. నాలాంటి తిక్క మనుషులు కూడా ఉండాలి కదా అని అంటుంది. ఇక ఆమె మాటలకు, చేష్టలకు కన్విన్స్ అవ్వని జడ్జ్‌లు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి పంపిస్తారు. ఐ హేట్ దిస్ జడ్జ్ మెంట్ అని అంటుంది దీబ్ జాన్. సరే సరే వెళ్లమ్మా అన్నట్టుగా శ్రీముఖి కౌంటర్లు వేస్తుంది. ఆ తర్వాత వశిష్ట, సత్య, నిఖిల్ అని కొంత మంది వస్తారు. వారిని అటు నుంచి అటే పంపించేస్తారు. ఆ తర్వాత భరత్ అని ఓ వ్యక్తి ఆయా షేర్ పాట పాడుకుంటూ, స్టెప్పులు వేస్తాడు. సరదాసరదాగా వచ్చావ్ కదా.. సరదా సరదాగానే పంపిస్తున్నాం అని జడ్జ్‌లు అంటారు.అమన్ మసూద్ అని నల్గొండ వచ్చిన వ్యక్తి కాస్త ఎంటర్టైన్ చేస్తాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో బీటెక్ ఆపేశా.. ఇప్పుడు లా చేస్తున్నా.. నెల రోజు థియేటర్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నా.. యాక్టింగ్ వచ్చు.. షార్ట్ ఫిల్మ్స్‌లో చేశాను అని అంటాడు. ఓ సిట్యువేషన్ ఇస్తే.. ఎమోషనల్‌గా నటించి అద్భుతం అని జడ్జ్‌ల చేత అనిపించుకుంటాడు. యాక్టింగ్ బాగా చేశావ్ అని జడ్జ్‌లు మెచ్చుకుంటారు. ఇక తెలివికి పరీక్ష అని.. ఓ పేపర్ మీద టీ షర్ట్ బొమ్మ వేసి.. దీనికి ఎన్ని బొక్కలున్నాయ్ అని అడుగుతాడు అభిజిత్. ఇక ఆ ఆన్సర్ చెప్పు, దాని మీద వ్యాసం రాయమని పక్కన కూర్చోబెడతారు.సిద్దిపేట్ నుంచి సుమ అనే అమ్మాయి వస్తుంది. 16వ శతాబ్దంలో వచ్చాం.. సిద్దిపేట్.. మేం జాట్స్.. చాలా జాబ్స్ వచ్చాయి.. వదిలేశా.. అభిజిత్‌లో కామ్, కంపోజ్డ్లా, కోపం వస్తే బిందులా.. మింగిల్ అవ్వడంలో నవదీప్లా.. నవ్వుతూ ఉంటా శ్రీముఖిలా అని అందరినీ కవర్ చేస్తుంది సుమ.. రిలేషన్ షిప్లో లేను.. అమ్మాయిలే ఎక్కువ ప్రేమిస్తారు.. అని సుమ అంటుంది. నువ్వు పోలీసు.. వాడు (అమన్) లాయర్.. అని వాడు నీకు ఓకేనా? అన్నట్టుగా నవదీప్ అడుగుతాడు. అమ్మాయిలతో పులిహోర కలిపాడు.. బయట అని అమన్ గురించి సుమ చెబుతుంది. ఆ ఎల్లో కలర్ డ్రెస్ బాగా లేదు అని సుమ అంటుంది.ఇంతకు ముందు అమ్మాయిలు డామినేటింగ్‌గా ఉంటారు అని అమన్ అన్నాడు. ఇప్పుడు మీరు డిబేట్ చేసుకోవాలని శ్రీముఖి అంటుంది. ఇంత అందంగా ఉన్నారు.. ఇది డామినేటింగ్ కాదా.. అని సుమకి బిస్కెట్ వేస్తాడు అమన్. అలా కాసేపు ఇద్దరూ డిబేట్ చేసుకుంటారు. కాసేపు అమన్‌ను పక్కన పెడతారు. అవు పేడ మొహానికి రాసుకుంటావా?.. అని టాస్క్ ఇచ్చి.. మొహానికి రాసుకునే టైంకి ఆపమని అంటారు. బాగానే మాట్లాడుతున్నావ్.. క్యూట్‌గా ఉన్నావ్.. జెన్యూన్ అనిపిస్తోంది.. డైరెక్ట్‌గా టాప్ 15 పంపించను.. ఇంకో యాంగిల్ చూడాలి.. నవదీప్, అభిజీత్ గ్రీన్ ఇచ్చి.. బిందు మాత్రం రెడ్ ఇస్తుంది.ఇక అమన్‌కి కూడా ఇలానే చెప్తారు. నవదీప్, అభి గ్రీన్ ఇస్తారు.. కాస్త కాన్ఫిడెన్స్ తెచ్చుకో.. మంచోడిలా ఉన్నావ్.. ఎంటర్టైనింగ్గా ఉన్నావ్.. ఇంకా ఫ్రూవ్ చేసుకో అని బిందు హోల్డ్‌లో పెడుతుంది. ఆ తర్వాత అక్షయ్ రాజ్ వస్తాడు. రోస్టింగ్ వీడియోలు తన హాబీ అని, ఇన్ స్టాలో వీడియోలు చేస్తుంటానని చెప్తాడు. సరే మమ్మల్ని రోస్ట్ చేయ్ అని టాస్క్ ఇస్తారు జడ్జ్‌లు. కానీ అక్షయ్ ఎవ్వరినీ కూడా రోస్ట్ చేయలేకపోతాడు. అది రోస్ట్ కానే కాదు.. ఇది రోస్ట్ ఆ? నవదీప్, బిందు, శ్రీముఖి, అభిజిత్ కామెంట్ చేస్తారు.సరే ఏదో ఒక టాపిక్ తీసుకుని రోస్ట్ చెయ్యి.. నీకు రెండు నిమిషాలు టైం ఇస్తా అని బిందు అంటుంది. టాపిక్ చెప్పండి అని టైం వేస్ట్ చేస్తుంటాడు. దీంతో బిందు సహనం కోల్పోయి రెడ్ ఇస్తుంది. త్వరగా రెడ్ ఇచ్చి పంపించేయండి.. నాకు చాలా బోరింగ్‌గా ఉంది అని శ్రీముఖి దండం పెడుతుంది. మీరు ఎలా చెప్తారండి.. మీరు హోస్ట్ కదా అని అక్షయ్ అంటే.. నేను హెస్ట్ మాత్రమే కాదు.. జ్యూరీలో పార్ట్ అని శ్రీముఖి అంటుంది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక కంటెంట్ క్రియేట్ చేస్తా. బిగ్ బాస్ లవ్ ట్రాక్ సెట్ చేస్తే.. అది కూడా చేస్తా అని నోరు జారతాడు.బిగ్ బాస్ షోలో లవ్ ట్రాక్? అది రియాల్టీ షో కదా.. అలా బిగ్ బాస్ చేస్తాడా? అని ప్రశ్నిస్తారు జడ్జ్‌లు. దీంతో అక్షయ్ ఏం చెప్పాలో తెలీక కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రోస్టింగ్ చేయమంటే అది కూడా చేయడం లేదు.. చెత్తగా ఉందని, నీలో మ్యాటర్ లేదని, బోరింగ్‌గా ఉన్నావ్ అని నవదీప్ కూడా రెడ్ ఇస్తాడు. అమ్మయ్య నాకు హ్యాపీగా ఉంది అంటూ శ్రీముఖి తన శాడిజాన్ని చూపిస్తుంది. నీకు వచ్చిన పని కూడా చేయడం లేదు.. రోస్టింగ్ వచ్చు అన్నావ్.. వచ్చిన పనే చేయడం లేదు.. రాని పని బిగ్ బాస్ ఇంట్లో చేస్తావ్ అని నమ్మకం ఏంటి.. నువ్వు వెళ్లు రా బై అని అభిజిత్ అంటాడు. దీంతో అమన్ బయటకు వెళ్తాడు. ఇప్పుడు బయటకు వెళ్లి మన మీద రోస్ట్ చేస్తూ వీడియోలు పెడతాడు చూడు అని శ్రీముఖి అంటాడు. ఇప్పుడు కంటెంట్ వస్తుంది అని నవదీప్, బిందు మాధవి అంటారు.ఆ తర్వాత గాయత్రి అని హైదరాబాద్ నుంచి ఓ అమ్మాయి వస్తుంది. మొదట్లో వంద కేజీలు ఉండేదాన్ని.. యాక్టింగ్ కోసం 45 కేజీలు తగ్గా.. సింగిల్ మదర్ నన్ను పెంచింది.. నేను ఎలా ఉంటానో చూపించాలి.. అని బిగ్ బాస్ షోకి వస్తున్నా అని అంటుంది. అదే బిగ్ బాస్ కాదు కదా.. నిన్ను నువ్వు ఫ్రూవ్ చేసుకోడానికి బిగ్ బాస్ పంపించాలా? అని అంటారు. శ్రీముఖితో బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టు గొడవ అయిందన్నట్టుగా, ఆమె వాదించాలి అని ఓ టాస్క్ ఇస్తారు. అందులో గాయత్రి బాగానే చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్ ఇంట్లో అవసరమే.. అని నవదీప్, అభిజిత్ గ్రీన్స్ ఇచ్చి, బిందు మాత్రమే రెడ్ ఇచ్చి హోల్డ్‌లో పెడతారు..పోతురాజ్, పూనిత, సాగరిక, చరణ్, శర్మిక వంటి కంటెస్టెంట్లను అటు నుంచి అటే పంపించేస్తారు. రుచిత నిహాని ముందుగా నానమ్మ వేషంలో వచ్చి అందరినీ పలకరిస్తుంది. ఆటలు ఆడకుండా గెలిచావ్.. చివరకు గెలిచావ్.. అదే ముఖ్యం అని అభిజిత్‌తో అంటుంది. ఆ తర్వాత ఒరిజినల్ గెటప్‌లో వస్తుంది.. వరంగల్ నుంచి వచ్చానని, కరోనాలో చావు భయం వల్ల యాక్టింగ్‌లోకి వచ్చాను..మొదట్లో రిజెక్షన్ కామన్.. ఇదే అన్నపూర్ణ నుంచి ఎన్నో సార్లు గెంటేశారు.. ఇప్పుడు ఇక్కడ నిలబడి నా జర్నీని చెప్పుకుంటున్నాను.. నాలో నాకు నచ్చింది ఇదే అని అంటుంది. ఇక ఆమె మాటలు, చలాకీతనం ఇవన్నీ చూసి బిందు, నవదీప్ గ్రీన్ ఇస్తారు. బిగ్ బాస్ ఇంటికి సరిపోయేలా ఉందని అంటారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్.. నేనే కరెక్ట్ అని అనుకోవడం కూడా తప్పు.. నేను కన్విన్స్ కాలేదు.. నా వరకు రెడ్.. అని హోల్డ్‌లో పెట్టేస్తాడు అభిజిత్. అంతటితో రెండో ఎపిసోడ్ పూర్తవుతుంది.