
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Bigg Boss Agni Pariksha 2: బిగ్ బాస్ అభిమానులకు మరోసారి సందడి మొదలైంది. ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2’ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్లేమ్ టూర్‌ను నిర్వాహకులు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ టూర్ ద్వారా అగ్ని పరీక్ష షో గురించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అభిమానులతో నేరుగా కలుస్తున్నారు. ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణ్ తన ఆటతీరుతో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో క్రమశిక్షణ, ఓపిక, పట్టుదలతో ముందుకు సాగారు. తన ఆటతో అభిమానులను ఆకట్టుకుని చివరకు సీజన్ 9 విజేతగా నిలిచారు. కళ్యాణ్ పడాల ఫ్లేమ్ టూర్లో పాల్గొనడంతో విజయనగరంలో అభిమానుల సందడి కనిపించింది. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కళ్యాణ్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయనను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కళ్యాణ్ పడాల తన అభిమానులతో మాట్లాడారు. బిగ్ బాస్ ప్రయాణంలో విజయనగరం ప్రజలు తనకు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. వారి మద్దతు తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని తెలిపారు. విజయనగరం నుంచి బిగ్ బాస్ వేదిక వరకు తన ప్రయాణం ప్రేక్షకుల ఆదరణ వల్లే