
ఇక రాత్రి అయినా కూడా త్రిగుణ్.. ఆ గిన్నెలు కడిగే సోదిని మాత్రం వదిలిపెట్టలేదు. సింక్‌లో కొన్ని గిన్నెలు ఉండటంతో.. వాటిని నేను కడుగుతా అని తానంతట తానే వెళ్లాడు. పర్లేదు.. నేను చేసే పని మీరు చేయొచ్చా? అని రోహిత్ అడగ్గా.. ఏం పర్లేదు నేను సగం క్లీన్ చేసేస్తా అని అన్నాడు త్రిగుణ్. ఆ తరువాత.. మళ్లీ ఫిటింగ్‌లు పెట్టరు కదా.. నామినేషన్స్‌లో, కెప్టెన్సీ టాస్క్‌లో అని ముందే అడిగాడు రోహిత్. అయితే సరిగ్గా అతను ఏదైతే అన్నాడో.. అదే పాయింట్‌ని నామినేషన్స్‌లో లేవనెత్తి తన గుణం చూపించాడు త్రిగుణ్. గుర్తు పెట్టుకో రోహిత్.. నాకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో అని అన్నాడు త్రిగుణ్. ఇక రోహిత్ బుర్ర తినడం అయిపోయిన తరువాత.. కిచెన్‌లో వంట చేస్తున్న వంశీ దగ్గరకు వెళ్లి అతని చెవుల్ని కొరకడం స్టార్ట్ చేశాడు త్రిగుణ్. హౌస్‌లో కొత్త గ్రూప్ ఫామ్ అయ్యింది. వాళ్లు మేము అనే మాటకి వచ్చేశారు. ఆ గ్రూప్‌లో ఒకడు ఎప్పటికీ బాగు పడడు. బాగుపడినట్టు పెర్ఫామెన్స్ చేస్తాడు. టాస్క్‌లు గెలిస్తూ.. వర్క్ సరిగా చూస్తే ముందుకు వెళ్తేనే స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటాం’ అంటూ ఒకటే నస పెట్టాడు. పాపం వంశీ అలా వింటూ ఉన్నాడు. అలా తెల్లార్లూ.. బుర్ర తినేశాడో ఏమో కానీ.. ఉదయం కూడా కిచెన్లోనే కనిపించాడు త్రిగుణ్, వంశీలు. లేవడం లేవడమే.. ఝాన్సీ ఏంటి మీకు హెల్ప్ చేయడం లేదు అని మెల్లగా కెలికాడు. అవును.. ఈ మధ్య డైవర్ట్ అవుతుంది అని వంశీ అంటే.. బయట కూర్చుని సొల్లు వేసుకుంటుంది అని అన్నాడు త్రిగుణ్. ఆ తరువాత నాగార్జున ఇచ్చిన ఎంగిలి కప్పుల్ని రోహిత్ ఇంకా క్లీన్ చేయలేదు అంటూ మళ్లీ వెధవ సోది మొదలుపెట్టాడు. కడక్కపోతే వీకెండ్లో నాగార్జున అడుగుతారు.. మధ్యలో త్రిగుణ్‌కి వచ్చిన నొప్పి ఏంటో మరి. చివరికి ఉదయం గ్లౌజ్‌లు వేసుకుని ఆ ఎంగిలి కప్పుల్ని క్లీన్ చేశాడు రోహిత్. అవి కడిగాడో లేదో మళ్లీ వచ్చి చూసుకున్నాడు త్రిగుణ్. అయితే త్రిగుణ్ సాయంగా నిలబడింది షాలిని. ఆ తరువాత నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. అయితే గతంలో మాదిరిగా ఒక్కొక్కరూ వచ్చి ఇద్దరిద్దర్ని నామినేట్ చేయడం కాకుండా.. ఈ నామినేషన్ చేయడానికి కూడా అర్హత సాధించాలని రోప్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. హౌస్‌లో ఉన్న వాళ్లు ఇద్దరిద్దరుగా పోటీ పడి.. రోప్‌కి కట్టిన తాళ్లని విడిపించి.. అక్కడే ఉన్న గొడ్డలిని ఎవరైతే ముందు పట్టుకుంటారో వాళ్లకి నామినేషన్ చేసే అర్హత లభిస్తుందని చెప్పారు బిగ్ బాస్. దాంతో హౌస్‌లో ఉన్న వాళ్లు జంటలు జంటలుగా ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. ఎవరు టాస్క్‌లో పాల్గొనాలో ఇద్దరిద్దరిద్దరి పేర్లను బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మొదటిగా ఝాన్సీ, సుధీర్ల పేర్లు చెప్పడంతో.. ఆ టాస్క్‌లో సుధీర్ గెలిచాడు. దాంతో త్రిగుణ్, షాలినిలను నామినేట్ చేశాడు సుధీర్. త్రిగుణ్ మాటలు మార్చేస్తున్నాడు.. చాలాసార్లు ఫ్లిప్ అవుతున్నాడని.. మనోడి బాగోతాన్ని బయటపెట్టాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ని క్లియర్‌గా చెప్పాడు సుధీర్. సొల్లు రీజన్లు చెప్పకుండా పాయింట్ టు పాయింట్ పెట్టాడు సుధీర్. దెబ్బకి సమాధానం చెప్పలేక.. బ్బె బ్బె బ్బే అనేశాడు త్రిగుణ్. తన పాయింట్లను కూడా.. ఏదో పాఠం చదివినట్టుగా చకచకా చదివేశాడు సుధీర్. తన సెకండ్ నామినేషన్‌గా షాలిని చేశాడు. వాష్ రూం క్లీన్ చేయడాన్ని తప్పించుకోవడానికి తన దగ్గర పవర్‌ని మిస్ యూజ్ చేసిందని.. అది తనకి నచ్చలేదని చెప్పాడు సుధీర్. ఆ తరువాత దేవ్జానీ, కృష్ణుడు పోటీ పడగా.. దేబ్జానీ గొడ్డలి అందుకుని త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. చైత్ర విషయంలో ఆమె దగ్గర ఒక మాట. మా దగ్గర ఓ మాట చెప్పడం మాకు నచ్చలేదు. ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.. ఇలా మాటలు మార్చొద్దు అంటూ త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. అయితే త్రిగుణ్ మాత్రం.. నేను నేను అలా అనలేదు అంటూ తనకి అలవాటైన పద్దతిలో ప్లేట్ తిప్పేశాడు. ఆ తరువాత రోహిత్, వర్షిణి పోటీ పడగా.. రోహిత్ టాస్క్‌లో గెలిచి గొడ్డలి అందుకున్నాడు. రోహిత్.. త్రిగుణ్, ఝాన్సీలను నామినేట్ చేశాడు. నేషనల్ టెలివిజన్‌లో స్టెరాయిడ్స్ బాడీ అంటూ పర్సనల్ ఎటాక్ చేశాడు. నా ముందు ఒకలా.. నా వెనుక మరోలా మాట్లాడుతున్నాడు. మానిటర్ అంటూ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నాడు. సృష్టిని సుధీర్ బ్రో పైకి తోమడానికి పంపిస్తున్నాను అనే మాట త్రిగుణ్ నోట నుంచి రావడం మంచి పద్దతి కాదు. ఒక ఆడపిల్లని అబ్బాయిపైకి పంపించడం అనేది నీచమైన కామెంట్ అని అన్నాడు రోహిత్. దాంతో త్రిగుణ్.. ‘నా స్టడీ గురించి మాట్లాడావ్ కాబట్టి.. నేను అన్నాను.. దానికి పనిష్మెంట్ కూడా చేశాను’ అని తన మాటల్ని సమర్థించుకున్నాడు త్రిగుణ్. దాంతో ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ నడిచింది. ఆ తరువాత ఝాన్సీని నామినేట్ చేశాడు రోహిత్. ఆమె గేమ్ అసలు కనిపించడం లేదు.. అందరికీ ఒపీనియన్ ఉంది.. ఆటపై గ్రిప్ ఉంది. అసలు నీ ఒపీనియన్ కూడా చెప్పడం లేదు.. ఓ పక్కనే ఉండి.. సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ సేఫ్ గేమ్ ఆపెయ్ అంటూ నామినేట్ చేశాడు రోహిత్. దాంతో ఝాన్సీ.. ‘నేనేం సేఫ్ గేమ్ ఆడటం లేదు.. ఎవరి సలహాలు నాకు అవసరం లేదు. నా ఆట ఏంటో నాకు తెలుసు.. ఫుల్ గ్రిప్ ఉంది. నా స్ట్రాటజీలు నాకు ఉన్నాయ్. నా గురించి జనాలకు బాగా తెలుసులే.. నువ్వు చెప్తే నేను వినను అని అన్నది. ఇంతలో ఝాన్సీకి సపోర్ట్‌గా మధ్యలోకి దూరిపోయాడు త్రిగుణ్. నువ్వు ఝాన్సీకి లాయర్‌వా అంటూ ఇచ్చిపడేశాడు రోహిత్. ఆ తరువాత నరేష్, షాలిని పోటీ పడగా.. నరేష్ టాస్క్‌లో ఇరగదీశాడు. అనంతరం షాలినిని నామినేట్ చేశాడు నరేష్. ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ నడిచింది. ఆటలోనే కాదు.. మాటలోనూ షాలినిని డామినేట్ చేశాడు నరేష్. అనంతరం త్రిగుణ్, సృష్టిలు పోటిపడ్డారు. ఈ టాస్క్‌లో త్రిగుణ్ గెలవగా.. సుధీర్‌ని నామినేట్ చేశాడు. అయితే త్రిగుణ్ మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్ ఇచ్చాడు సుధీర్. సృష్టి నిన్ను తోముతుంది అని నీచంగా మాట్లాడింది నువ్వే అంటూ ఇచ్చిపడేశాడు సుధీర్. నిన్ను ఎవరూ పిలవరు.. నువ్వే వచ్చి మధ్యలోకి దూరతావ్.. గ్రూప్ ఫామ్ అవుతుందని అంటావ్.. నువ్వే ప్రతి గ్రూప్‌లోనూ దూరతావ్.. గోడమీద పిల్లలా ఉండొద్దు అని ఇచ్చిపడేశాడు సుధీర్. అయితే సుధీర్ అడిగిన ఒక్క పాయింట్‌కి కూడా సమాధానం చెప్పలేకపోయాడు త్రిగుణ్. ఆ తరువాత రోహిత్‌ని నామినేట్ చేశాడు. ఆ తరువాత ముఖేష్, అమన్‌లు పోటీ పడగా.. అమన్ గెలిచి గొడ్డలి అందుకున్నాడు. రాంప్రసాద్‌ని నామినేట్ చేసి.. తాను చెప్పాల్సిన పాయింట్‌ని సూటిగా చెప్పాడు. రెండోదిగా ఝాన్సీని నామినేట్ చేశాడు. నా దగ్గరకు వచ్చి బాగా గేమ్ ఆడానని చెప్పింది. ఆ తరువాత లోపలికి వెళ్లినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యావ్ అన్నావ్. మాటలు మార్చుతున్నావ్.. సేఫ్ గేమ్ ఆడున్నావ్ అని అన్నాడు. దాంతో ఝాన్సీ నేనేం గ్రూప్ గేమ్ ఆడటం లేదు.. నా ఆట నేను ఆడుతున్నాను.. జనాలు చూస్తున్నారు .. నా టాలెంట్ ఏంటో చూపిస్తా.. నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ శపథాలు చేసింది. చివరికి రం ప్రసాద్, వంశీలు పోటీలు పడ్డారు. అయితే వంశీ టాస్క్ గెలవడంతో గొడ్డలి అందుకున్నాడు. దేబ్జానీ నన్ను ఓ మాట అన్నది ఆ మాట వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను. అది ఆమె సరదాగా అన్నదో సీరియస్‌గా అన్నదో తెలియదు కానీ.. నేను బాధపడ్డాను. తను కావాలని అన్నదని కాదు అంటూ దేబ్జానీని నామినేట్ చేశాడు. ఆ తరువాత ముఖేష్.. రూంలో ట్రిమ్ చేయడం నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. నేను కావాలని చేయలేదు.. తరువాత క్లీన్ చేశాను అని చెప్పాడు ముఖేష్. దాంతో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాం ప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు నామినేట్ అయ్యారు. అమన్, వంశీ, నరేష్‌లు మాత్రమే ఈ వారం నామినేషన్స్‌లోకి వెళ్లలేదు. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.. దేబ్జానీ.. త్రిగుణ్, రోహిత్.. అమన్.. రాం ప్రసాద్, ఝాన్సీ