
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా జరుగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో అప్పుడే వారం రోజలు గడిచిపోయాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి వారంలోనే హౌస్ లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్‌ను ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ముందుగా ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత మరుసటి రోజే ప్రముఖ చైత్ర రాయ్ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చింది. కాగా మొదటి వారం లోనే ఇద్దరు కంటెస్టెంట్స్ ని , అది కూడా ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ చేయడం అనేది ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే ఎప్పుడూ జరగలేదు. కనీసం టాస్కులు ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా , కేవలం 5 రోజుల్లోనే చరణ్ , చైత్ర లను కంటెస్టెంట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది వీరిద్దరినీ సీక్రెట్ రూమ్ లో ఉంచి ఉంటారని,సమయానుకులంగా మళ్లీ హౌస్ లోకి మళ్లీ తీసుకొస్తారని అందరూ భావించారు. ఈ రూమర్స్ అన్నింటికీ కింగ్ నాగార్జున స్వయంగా చెక్ పెట్టారు. ఆర్జే చరణ్, ఛైత్ర నిజంగానే వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యారని ఆదివారం ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. అంతే కాదు , ఆ ఇద్దరితో స్పెషల్ గా వీడియో కాల్ లో కూడా మాట్లాడాడు.