
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ ఎపిసోడ్లో.. శ్రిష్టి చేతిలో ఉన్న పవర్‌ను కోల్పోవడం ఈ ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచింది. హౌస్‌లో దేబ్జానీ తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని నాగార్జున ప్రశంసించారు. అయితే రోహిత్, షాలినీ, శ్రిష్టిలకు తెలుగు వచ్చినప్పటికీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారు ఇంగ్లీష్‌లో మాట్లాడటం వల్ల చాలామంది ప్రేక్షకులకు అర్థం కావడం లేదని, తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం శ్రిష్టి, షాలినీలను అమన్‌కు హౌస్‌మేట్స్‌గా రివీల్ చేయించారు.




