© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Best Smartphones Under Rs 20k: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) ఘనంగా మొదలైంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్ బంపర్ డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.20,000 లోపు బడ్జెట్లో సరికొత్త ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ వివరాలు.. ఈ ప్రైమ్ డే సేల్‌లో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగించి పేమెంట్ చేసేవారికి 10 శాతం ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.. అంతేకాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగించే వారికి 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ పే లేటర్ (Amazon Pay Later)ను వినియోగించి పేమెంట్ చేసేవారికి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇప్పుడు రూ.20 వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ వివరాలు.. ఐకూ Z10 లైట్ 5G (iQOO Z10 Lite 5G) గేమింగ్‌తో పాటు పర్ఫార్మెన్స్కు కేరాఫ్ అడ్రస్‌గా భావించే ఐకూకి సంబంధించిన Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ రూ. 14,999 ధరకే అందుబాటులో ఉంది.. దీనిపై రూ.509 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ లభిస్తుండటంతో నెట్ ప్రైస్
కేవలం రూ.14,490కే అవుతుంది.. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.14,249 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు..
సాంసంగ్ గెలాక్సీ M36 5G (Samsung Galaxy M36 5G) ఈ సేల్‌లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన 6GBర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,999 ధరతో లభిస్తోంది.. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పేమెంట్ చేస్తే.. రూ.569 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. దీనితో ఈ ఫోన్ ధర రూ.18,430కి తగ్గుతుంది. ఇక పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 17,900 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
రియల్‌మి నార్జో 90x 5G (Realme Narzo 90x 5G) బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోరుకునే వారి కోసం రియల్‌మి నార్జో 90x 5G మోడల్ చాలా బెస్ట్.. మార్కెట్లో ఇది రూ.16,998కే అందుబాటులో ఉంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.509 క్యాష్‌బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చు. దీంతో ధర రూ.16,489కే పొందవచ్చు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 16,100 వరకు భారీ తగ్గింపును పొందవచ్చు.
రెడ్మి 15 5G (Redmi 15 5G) రెడ్మి 15 5G స్మార్ట్‌ఫోన్ 6G ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వేరియంట్ ధర రూ.20,498తో అందుబాటులో ఉంది.. అయితే, సేల్ సందర్భంగా లభిస్తున్న ప్రత్యేక కూపన్ ఆఫర్ వినియోగదారులు రూ.1,000 వరకు స్పెషల్ తగ్గింపు పొందవచ్చు.. దీనితో ఈ ఫోన్‌ను రూ.19,498కే సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ కార్డ్ ద్వారా అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.
లావా బోల్డ్ N2 5G (Lava Bold N2 5G) దేశీ బ్రాండ్ అయిన లావా నుంచి వచ్చిన బోల్డ్ N2 5G స్మార్ట్‌ఫోన్ రూ. 11,999కే లభిస్తోంది. దీనిపై రూ.359 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.11,640కే పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు గరిష్టంగా రూ.11,300 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.